Mulugu: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి సంపత్ రావు!

Mulugu: ములుగు కలెక్టరేట్‌లో ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించిన అదనపు కలెక్టర్ సంపత్ రావు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.

Narender, Staff Reporter  -Warangal
Published on: 12 Oct 2026 4:26 PM IST
Mulugu
X

Mulugu: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి సంపత్ రావు!

Mulugu: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన దరఖాస్తులను స్వీకరించారు. భూ సమస్యలకు సంబంధించి 05, ఇందిరమ్మ ఇళ్లకు 01, పింఛన్లకు 01, ఉద్యోగాలకు 02, ఇతర శాఖలకు సంబంధించి 05, మొత్తం 14 దరఖాస్తులు అందాయి.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.