Warangal: కేయూ హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. ఏబీవీపీ డిమాండ్!

Warangal: కాకతీయ విశ్వవిద్యాలయంలో హాస్టళ్లు, గర్ల్స్ మెస్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌ను ముట్టడించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Nov 2026 4:42 PM IST
Warangal
X

Warangal: కేయూ హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. ఏబీవీపీ డిమాండ్!

Warangal: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కాకతీయ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్ అధ్యక్షతన యూనివర్సిటీ లోని హాస్టల్ మరియు గర్ల్ మెస్ పరిస్థితుల మీద యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్నీ ముట్టడించటం జరిగింది.

అనంతరం యూనివర్సిటీ లోని సెనేట్ హాల్ లో వీసీ ప్రతాప్ రెడ్డి గారు మరియు రిజిస్టర్ రామచంద్రం గారు , హాస్టల్ డైరెక్టర్స్ మరియు ఇతర ప్రొఫెసర్స్ తో విద్యార్థులతో ముఖ మూకీ సమావేశం నిర్వహించటం జరిగింది.ఈ కార్యక్రమానికి ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు గారు హాజరై మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీలో చదువే విద్యార్థులు అందరూ పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు,వారికి కనీస హాస్టల్ సదుపాయాలు కూడా కల్పించకుండా విద్యార్థులును బెదిరిస్తున్నారు.

ఈ యూనివర్సిటీలో విద్యార్థులకు అనేక హాస్టల్ సమస్యలు ఉండగా యూనివర్సిటీ అధికారులు ఏం వచ్చినప్పుడు పట్టించుకోకుండా, అవినీతి చేసిన చేసిన వారిపై కూడా ఏం చర్యలు తీసుకోకుండా ఉన్నారు.విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులు హాస్టళ్లలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ, నాణ్యమైన ఆహారం, విద్యుత్, స్నానపు గదులు, భద్రతా ఏర్పాట్లు వంటి మౌలిక సదుపాయాల విషయంలో సమస్యలు ఉన్నాయని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే హాస్టల్ గదుల నిర్వహణ, దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. విద్యార్థినుల భద్రతకు సంబంధించి సీసీ కెమెరాలు, సరైన లైటింగ్, మహిళా సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.

విద్యార్థినులు ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం విశ్వవిద్యాలయానికి వస్తుంటే, కనీస వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం బాధాకరం. విద్యార్థినుల సమస్యలను కేవలం ఫిర్యాదులకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి వారం రోజుల్లో పరిష్కరించాలి లేని పక్షంలో విద్యార్థులతో కలిసి ఉద్యమానికి శ్రీకారం చుడతం అని ఆయన హెచ్చరించారు.

ఏబీవీపీ ప్రధాన డిమాండ్లు:

బాలికల హాస్టళ్లలో తాగునీటి సమస్యను పరిష్కరించాలి.

నాణ్యమైన ఆహారాన్ని అందించి, మెస్ నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలి.

మరుగుదొడ్లు, స్నానపు గదులకు మరమ్మతులు చేసి పరిశుభ్రతను మెరుగుపరచాలి.

హాస్టల్ పరిసరాల్లో పారిశుద్ధ్యం, దోమల నివారణ చర్యలు చేపట్టాలి.

విద్యార్థినుల భద్రత కోసం సీసీ కెమెరాలు, లైటింగ్, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలి.

హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి.

విద్యార్థినుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేయాలి.

అనంతరం విశ్వవిద్యాలయ వీసీ ప్రతాప్ రెడ్డి గారు వెంటనే స్పందించి బాలికల హాస్టల్లో సమస్యలను పరిస్కరిస్తాం అని హామీ ఇచ్చారు. లేనిపక్షంలో విద్యార్థినుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఏబీవీపీ హెచ్చరిస్తోంది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ ప్రాముక్ అంబాల కిరణ్,మేకల జ్ఞానేశ్వర్ ,సాయి కుమార్,సారిక,మధు, నందు,వినోద్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.

సదా భారతమాత సేవలో

మేకల జ్ఞానేశ్వర్

ఏబీవీపీ యూనివర్సిటీ కార్యదర్శి

కాకతీయ విశ్వవిద్యాలయం

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్