Bayyaram: ఐదేళ్లుగా పరారీలో ఉన్న పోక్సో కేసు నిందితుడి అరెస్ట్!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 2017 పోక్సో కేసులో ఐదేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా పరారీలో ఉన్న నిందితుడు సూర్నపాక రామును అరెస్ట్ చేసి జైలుకు తరలించిన పోలీసులు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 6 Nov 2026 6:51 PM IST
Bayyaram
X

Bayyaram: ఐదేళ్లుగా పరారీలో ఉన్న పోక్సో కేసు నిందితుడి అరెస్ట్!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లోలో సిఐ రవీందర్ మాట్లాడుతూ..పరిధిలో 2017వ సంవత్సరంలో నమోదైన POCSO కేసులో గత ఐదేళ్లుగా న్యాయస్థానానికి హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని ఈరోజు అరెస్టు చేసి, న్యాయస్థానం ముందు ఆధారపరిచామన్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితుడిని జైలుకు తరలించడం జరిగింది.

వివరాల్లోకి వెళితే 2017వ సంవత్సరంలో సూర్నపాక రాము, వయస్సు 42 సంవత్సరాలు, నివాసం ఒజ్జోనిగూడెం, టేకులపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనే వ్యక్తిపై POCSO చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో అప్పట్లోనే నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది.

అనంతరం కేసు విచారణలో భాగంగా న్యాయస్థానానికి హాజరుకావాల్సి ఉండగా, నిందితుడు కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో న్యాయస్థానం నిందితుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది.

ఈ క్రమంలో బయ్యారం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి, ఐదేళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు జైలుకు తరలించడం జరిగింది.

న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించకుండా తప్పించుకుని తిరిగే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బయ్యారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎల్. రవీందర్ తెలిపారు

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM