Warangal: వరంగల్‌లో ‘అభయ-మై ట్యాక్సీ సేఫ్’ యాప్ ప్రారంభం!

Warangal: మహిళలు, ప్రయాణికుల భద్రత కోసం రూపొందించిన ‘అభయ-మై ట్యాక్సీ సేఫ్’ యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ప్రారంభించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 5 Oct 2026 7:49 PM IST
Warangal
X

Warangal: వరంగల్‌లో ‘అభయ-మై ట్యాక్సీ సేఫ్’ యాప్ ప్రారంభం!

Warangal: మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో , రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, IPS ప్రారంబించారు.

ఈ సందర్బంగా కమిషనర్ గారు మాట్లాడుతూ-రానున్న రోజుల్లో ప్రయాణికులు “అభయ–మై ట్యాక్సీ సేఫ్” స్టిక్కర్లు అంటించి ఉన్న టాక్సీ వాహణాల్లో మాత్రమే ప్రయాణిస్తారని తెలిపారు. “అభయ–మై ట్యాక్సీ సేఫ్” స్టిక్కర్లను ప్రతి ఆటో మరియు టాక్సీ డ్రైవర్లు తప్పనిసరిగా అంటించుకోవాలని, టాక్సీ పైన ఉన్న స్టిక్కర్ ను చూడగానే ప్రయాణికులకు నమ్మకం కలుగుతుందని, ఇందుకోసం ప్రతి ఆటో మరియు క్యాబ్ యజమానులు వారి టాక్సీ వివరాలను “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్ లో నమోదు చేసుకొని, సమీప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించి, స్టిక్కర్ లను పొంది, వారి టాక్సీ వాహనాలకి అంటించుకోవాలని తెలిపారు.

ట్యాక్సీ డ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఈ సందర్భంగా ట్యాక్సీ డ్రైవర్లకు యాప్ వినియోగం, ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. ట్యాక్సీ వాహనాల్లో ప్రయాణించే మహిళలు, ఇతర ప్రయాణికులు కూడా “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ట్యాక్సీ వాహనాలపై ఏర్పాటు చేసిన స్టిక్కర్ల ద్వారా ప్రయాణికులకు యాప్‌పై అవగాహన కల్పించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న భద్రతా సదుపాయాలను వినియోగించుకునేలా ప్రోత్సహించనున్నారు. అలాగే నాటక ప్రదర్శన ద్వారా పోలీసు కళాబృందం వారు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, అడిషనల్ డీసీపీ (అడ్మినిస్ట్రేషన్) రాయల ప్రభాకర్ రావు, ట్రాఫిక్ ఏసీపీ టి.సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లు సుజాత, వెంకన్న, ట్రాఫిక్ సిబ్బంది, టాక్సీ డ్రైవరు లు, మహిళలు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.