Hanumakonda: పరకాలలో ఆదార్ పార్టీ ప్రెస్మీట్.. స్థానిక ఎన్నికల్లో పోటీ!
Hanumakonda: హనుమకొండ జిల్లా పరకాలలో ఆదార్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఈడా శేషగిరిరావు గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు.
Hanumakonda: పరకాలలో ఆదార్ పార్టీ ప్రెస్మీట్.. స్థానిక ఎన్నికల్లో పోటీ!
Hanumakonda: పరకాల పట్టణంలోని లక్ష్మీ సాయి ఫంక్షన్ హాల్లో ఆదార్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఈడా శేషగిరిరావు గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో స్థాపించిన ఆదార్ పార్టీ 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓట్ల శాతంలో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచిందని తెలిపారు. తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి ఆదరణ పొందామని, పార్టీ బలోపేతం అవుతోందని అన్నారు.
ఎన్నికల సంఘం పార్టీకి చపాతీ రోలర్ గుర్తు కేటాయించిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి ప్రతి స్థానిక సంస్థలో అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు.
లక్ష్యం మనమెంతో మనకంత - అందరికీ సమాన రాజ్యాధికారం, తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి పార్టీ ప్రధాన లక్ష్యం "మనమెంతో మనకంత - అందరికీ సమాన రాజ్యాధికారం" అని డాక్టర్ శేషగిరిరావు గౌడ్ పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో సమాన వాటా దక్కాలన్నారు.
తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రావాలన్నదే ఆదార్ పార్టీ ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




