Hanumakonda: హన్మకొండ జేఎన్‌ఎస్‌లో 78వ ఎస్‌జీఎఫ్ స్కూల్ గేమ్స్ ప్రారంభం!
Hanumakonda: హనుమకొండ జేఎన్‌ఎస్‌లో గురువారం 78వ ఎస్‌జీఎఫ్ అండర్-14, అండర్-17 స్కూల్ గేమ్స్‌ను నెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి ప్రారంభించారు.
Hanumakonda: హన్మకొండ జేఎన్‌ఎస్‌లో 78వ ఎస్‌జీఎఫ్ స్కూల్ గేమ్స్ ప్రారంభం!
హన్మకొండ: 78వ ఎస్.జి.ఎఫ్ అండర్-14 మరియు అండర్-17 స్కూల్ గేమ్స్ పోటీలను హన్మకొండ నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ విష్ణు వర్ధన్ రెడ్డి గారు హనుమకొండలోని జవహార్ లాల్ నెహ్రు స్టేడియంలొ ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా విష్ణు వర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థులలో క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో ఉన్న విధ్యార్దుల క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
ఈ క్రిడల్లొ బాలికలు ఎక్కువమంది పాల్గొనడం సంతోశంగ ఉందని అయన అన్నారు.
ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, యువ క్రీడాకారులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు క్రీడా ఉపాధ్యాయులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, క్రీడాకారులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.




