Jangaon: నీటికుంటలో పడి ఏడేళ్ల బాలుడు దుర్మరణం!
Jangaon: జనగామ జిల్లా బానాజీపేటలో నీటికుంటలో పడి 7 ఏళ్ల బాలుడు మహమ్మద్ షహర్ మృతి. పండుగ వేళ అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలుడి మరణంతో గ్రామంలో విషాదం!
Jangaon: నీటికుంటలో పడి ఏడేళ్ల బాలుడు దుర్మరణం!
జనగామ: జనగామ పట్టణానికి చెందిన ఏడేళ్ల బాలుడు నీటికుంటలో పడి మృతి చెందిన ఘటన రఘునాథపల్లి మండలం బానాజీపేట గ్రామంలో చోటుచేసుకుంది.
ఒకటో తరగతి చదువుతున్న మహమ్మద్ షహర్ పండుగ సందర్భంగా అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. తాతతో కలిసి నీటిని చూసేందుకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు పండుగ వేళ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.




