Mahabubabad: కురవి మండలంలో గులాబీ గూటికి కాంగ్రెస్ నాయకులు!
Mahabubabad: సూర్యతండలో కాంగ్రెస్‌కు షాక్. మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ సమక్షంలో ఉపసర్పంచ్ తేజావత్ గోపి, 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు BRSలో చేరారు.
Mahabubabad: కురవి మండలంలో గులాబీ గూటికి కాంగ్రెస్ నాయకులు!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూర్యతండ గ్రామపంచాయతీకి చెందిన ఉపసర్పంచ్ తేజావత్ గోపి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది నాయకులు, కార్యకర్తలు గురువారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ సమక్షంలో వారంతా బీఆర్‌ఎస్ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో నల్లెల్ల మాజీ ఎంపీటీసీ మంచిప్రోలు చంద్రారెడ్డి, తేజావత్ మంగీలాల్, నల్లెల్ల సర్పంచ్ రెంటాల కృష్ణ, బానోతు కోటయ్య, గ్రామ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు అజ్మీర నవీన్, తేజావత్ బిచ్చు రాము, అజ్మీర నాగరాజు, తేజావత్ నరేష్, అజ్మీర సూక్య, అజ్మీర రాములు, తేజావత్ హత్తి రాము, తేజావత్ శ్రీను, తేజావత్ సంతోష్, అజ్మీర మంగ్య, అజ్మీర మంగీలాల్, తేజరాం, అజ్మీర కోటయ్య తదితరులు పాల్గొన్నారు.




