Jangaon: స్టేషన్ ఘన్పూర్లో 1996-97 ZPSS బ్యాచ్ మిత్రుల దాతృత్వం!
Jangaon: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ZPSS స్కూల్ 1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థుల మానవత్వం. అకాల మరణం చెందిన బాల్య మిత్రుడు చింత శ్రీనివాస్ కుటుంబానికి రూ. 23,500 ఆర్థిక సాయం అందజేత.
Jangaon: స్టేషన్ ఘన్పూర్లో 1996-97 ZPSS బ్యాచ్ మిత్రుల దాతృత్వం!
Jangaon: స్నేహం అంటే పాఠశాల గోడలకే పరిమితం కాదు, కష్టకాలంలో అండగా నిలవడమే నిజమైన స్నేహం అని నిరూపించారు స్టేషన్ ఘన్ పూర్ ZPSS స్కూల్ 1996-97 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు.స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన వారి బాల్య మిత్రుడు చింత శ్రీనివాస్ (46) అనారోగ్యంతో అకాల మృతి చెందడం వారిని తీవ్రంగా కలచివేసింది.
భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులతో పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని చూసి చలించిపోయిన మిత్రులు మానవత్వం చాటుకున్నారు."మా స్నేహం పాఠశాల రోజులకే పరిమితం కాదు, కష్టకాలంలో కూడా అండగా ఉండాలి" అని భావించిన మిత్రులు తమ వంతుగా రూ. 23,500 నగదును శుక్రవారం మృతుని కుటుంబానికి అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక మంచి స్నేహితుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేస్తూ, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మిత్రుడు లేకపోయినా అతని కుటుంబానికి అండగా నిలిచిన వారి స్నేహ బంధం స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది.ఈ కార్యక్రమంలో జీడి కనకయ్య, నక్క లక్ష్మణ్, కలకోల్ల నరహరి, చింత అంజయ్య, తాటికొండ రమేష్, నీల రవి, నీల చంద్రకళ, దేవరాజుల సరోజన, గోరంతల పద్మ, కుసుమ స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు




