Nekkonda: నెక్కొండలో 12 కిలోల గంజాయి పట్టివేత.. కానిస్టేబుల్ అరెస్ట్

Nekkonda: నెక్కొండ బస్టాండ్ సమీపంలో రూ.6 లక్షల విలువైన 12 కిలోల గంజాయితో మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ నితిన్ న్యాను షిండేను పోలీసులు అరెస్ట్ చేశారు.

G PRADEEP KUMAR, NARSAMPET
Published on: 25 Oct 2026 9:25 PM IST
Nekkonda
X

Nekkonda: నెక్కొండలో 12 కిలోల గంజాయి పట్టివేత.. కానిస్టేబుల్ అరెస్ట్

వరంగల్ జిల్లా: నెక్కొండ బస్టాండ్ సమీపంలో 12 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన నితిన్ న్యాను షిండే అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయితో పాటు మూడు సెల్‌ఫోన్లను సీజ్ చేశారు.

నెక్కొండ ఎస్సై శ్రావణ్ కుమార్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిని పట్టుకుని తనిఖీ చేయగా 12 కిలోల ఎండు గంజాయి బయటపడింది.

ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని కొనుగోలు చేసి, మహారాష్ట్రలో అధిక ధరకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని ఎస్సై తెలిపారు.

G PRADEEP KUMAR, NARSAMPET

G PRADEEP KUMAR, NARSAMPET