Garividi: కోనూరులో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి బొత్స పూజిత ఎన్నికల ప్రచారం!

Garividi: గరివిడి మండలం కోనూరు గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని జడ్పీటీసీ అభ్యర్థి బొత్స పూజిత విజ్ఞప్తి.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 26 Oct 2026 1:34 PM IST
Garividi
X

Garividi: కోనూరులో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి బొత్స పూజిత ఎన్నికల ప్రచారం!

Garividi: నవంబర్ 3వ తేదీన జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మాజీ సర్పంచ్ బూడి శ్రీరాములు గారి అధ్యక్షతన గరివిడి మండలం జడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి బొత్స పూజిత గారు కోనూరు గ్రామంలో పర్యటించి ప్రజలను కలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, మహిళలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో జడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి బొత్స పూజిత గారికి, ఎంపిటిసి అభ్యర్థి కొండ్రు ఎల్లరీ గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శాసనమండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు, శ్రీమతి బొత్స ఝాన్సీ గారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారో వారి అడుగుజాడల్లో, వారి సూచనలతో తాను కూడా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.

అదేవిధంగా, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ప్రజల ఆశలను నిరాశలుగా మార్చిన ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.

* ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీవిశేశ్వరావు,శ్రీ గణపతి రాజు , శ్రీబుడి శ్రీరాములు,శ్రీ పొన్నాడ కుమార్ ,శ్రీ రెడ్డి గోవింద్, ఎంపిటిసి అభ్యర్థి శ్రీ కొండ్రు ఎల్లరీ గ్రామ ముఖ్య నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY