Cheepurupalli: వైఎస్సార్‌సీపీకి షాక్.. టీడీపీలోకి 50 కుటుంబాల భారీ చేరికలు!

Cheepurupalli: విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గరుగుబిల్లిలో వైసీపీకి ఎదురుదెబ్బ. ఎమ్మెల్యే కళావెంకటరావు సమక్షంలో టీడీపీలోకి చేరిన 50 కుటుంబాలు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 21 Sept 2026 4:05 PM IST
Cheepurupalli
X

Cheepurupalli: వైఎస్సార్‌సీపీకి షాక్.. టీడీపీలోకి 50 కుటుంబాల భారీ చేరికలు!

Cheepurupalli: విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గరుగుబిల్లి పంచాయతీలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. గరుగుబిల్లి పంచాయతీకి చెందిన ఏకీగ్రవ MPTC చిరంజీవి నాయుడు, మాజీ MPTC ఆవాల సన్యాసి నాయుడు వారి అనుచరులతో కలిసి సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఆదివారం చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. పార్టీలో చేరిన వారికి కళా వెంకటరావు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలోకి వస్తున్నారని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY