Vizianagaram: జామి మండలంలో ఎన్నికల వేళ వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ!

Vizianagaram: విజయనగరం జిల్లా జామి మండలంలో వైసీపీకి షాక్, భారీగా టీడీపీలోకి చేరికలు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న 20 కుటుంబాలు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 3 Nov 2026 12:46 PM IST
Vizianagaram
X

Vizianagaram: జామి మండలంలో ఎన్నికల వేళ వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ!

Vizianagaram: విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం జామి మండలం వెంకటరాజుపాలెం ఎంపీటీసీ పరిధిలో తెలుగుదేశం పార్టీకి భారీ బలం చేకూరింది. వెన్నుపాడు పంచాయతీకి చెందిన మాజీ ఎంపీటీసీ రాయవరపు సత్యం ఆధ్వర్యంలో 20 కుటుంబాలు మంత్రి కార్యాలయం వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో టీడీపీలో చేరాయి.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ మంత్రి కార్యాలయం వద్ద జరిగిన ఈ చేరికల కార్యక్రమం జామి మండలంలో కూటమికి మరింత బలాన్ని చేకూర్చింది. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నాయకత్వానికి, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై తాము టీడీపీలో చేరుతున్నట్లు రాయవరపు సత్యం తెలిపారు.

వారందరికీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని, తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటరాజుపాలెం నాయకులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.