Rajam: అభివృద్ధికి సహకరించలేకపోతే మౌనంగా ఉండండి: కళా వెంకటరావు!
Rajam: విశాఖ సీఐఐ ఇండస్ట్రియల్ సమ్మిట్ విజయవంతం కావడాన్ని ఓర్వలేక వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు విమర్శించారు.
Rajam: అభివృద్ధికి సహకరించలేకపోతే మౌనంగా ఉండండి: కళా వెంకటరావు!
రాజాం: విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ ఇండస్ట్రియల్ సమ్మిట్ విజయవంతం కావడం పట్ల వైసీపీ నేతలు ఓర్వలేక రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించలేకపోతే కనీసం అడ్డుపడకుండా మౌనంగా ఉండాలని ఆయన హితవు పలికారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతమైందని, గతంలో కుదుర్చుకున్న రూ.23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాల్లో కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మిగిలిన ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తయిందని వెల్లడించారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పరిశ్రమలు, విద్యాసంస్థల ఏర్పాటుపై ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించలేదని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే వైసీపీ నేతలు విమర్శలు చేయడం తగదన్నారు. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ ఇండస్ట్రియల్ సమ్మిట్‌పై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
నక్కపల్లి వద్ద రూ.2 లక్షల కోట్ల పెట్టుబడితో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, విశాఖలో సాఫ్ట్వేర్ కంపెనీలు, స్టార్టప్‌లు, చిప్ తయారీ సంస్థలు, భోగాపురం సమీపంలో వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు వంటి ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో రుషికొండ నిర్మాణాలకే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. ప్రజలు ఎన్నికల్లో వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేసినప్పటికీ ఆ పార్టీ నేతల వైఖరిలో మార్పు రాలేదని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్షాలు కూడా సహకరించాలని, పరిశ్రమల ఏర్పాటుకు ఆటంకాలు కలిగించే వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని కిమిడి కళావెంకటరావు పేర్కొన్నారు.




