Vizianagaram: పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Vizianagaram: గజపతినగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల కోసం రూ. 2,692.34 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 1 Oct 2026 6:19 PM IST
Vizianagaram
X

Vizianagaram: పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజ‌య‌న‌గ‌రం: విజ‌య‌న‌గ‌రం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గజపతినగరం టానా వీధిలో పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు పింఛన్ల పంపిణీ కోసం రూ.2,692.34 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61.80 లక్షల మంది పింఛనుదారులకు ల‌బ్ధి చేకూరుతుంది.ఈ రోజు పంపిణీ చేసే నిధుల్లో రూ.2,675.63 కోట్లను సంబంధిత స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డు పింఛను బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.

కేంద్ర ఆదేశాల మేరకు 'SNA SPARSH' ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో (DBT) పింఛన్ జమ చేసే విధానాన్ని విజయనగరం జిల్లా గజపతినగరంలో పైలట్ ప్రాతిపదికన ప్రారంభించాము. ఈ కొత్త విధానం కింద గజపతినగరం మండలంలోని NSAP పింఛనుదారుల ఖాతాల్లో నేరుగా రు. 6 ల‌క్ష‌లు జ‌మ అవుతాయి.

ఈ DBT చెల్లింపు నిబంధన కేవలం NSAP పరిధిలోని 9.34 లక్షల మంది పింఛనుదారులకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన 53 లక్షల మంది ఎన్టీఆర్ భరోసా పింఛనుదారులకు యథావిధిగా ఇంటి వద్దే నగదు రూపంలో పింఛన్ అందిస్తారు.

తాత్కాలిక వలసల వల్ల ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పింఛను తీసుకోలేని వారికి బకాయిలతో కలిపి రూ.156.21 కోట్లు విడుదల.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పింఛన్ల కోసం రూ.76,199.38 కోట్ల నిధుల విడుదల 9.25 గంట‌ల‌కే రాష్ట్ర‌వ్యాప్తంగా 72 % మంది పింఛ‌న్లపంపిణీపూర్త‌య్యింది.2026–27 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.33,485.10 కోట్లను కేటాయించింది.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM