Vizianagaram: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి!

Vizianagaram: విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. జడ్పీటీసీ అభ్యర్థికి మద్దతు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 1 Nov 2026 2:29 PM IST
Vizianagaram
X

Vizianagaram: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి!

Vizianagaram: విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. జడ్పీటీసీ అభ్యర్థి పాశల నీరజ, స్థానిక ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, ముఖ్యంగా యువతకు, రైతులకు, విద్యార్థులకు జరిగిన మేలును వివరించారు.

జడ్పీటీసీ అభ్యర్థి పాశల నీరజ మన ప్రాంత ఆడపడుచు అని అన్నారు. సొంత ఊరు దేవుపల్లి, తాతగారి ఊరు గొల్లుపాలెం, అత్తవారి ఊరు బి.రాజేరు అని, అంతా బొండపల్లి మండలంలోనే ఉంటారని తెలిపారు. స్థానిక అభ్యర్థిని గెలిపిస్తే మీ సమస్యలను నేరుగా చెప్పుకుని పరిష్కరించుకోవచ్చని, ఎప్పుడూ అందుబాటులో ఉంటారని అన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయిలో అందుతున్నాయని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కూటమి నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM