Vizianagaram: విజయనగరం మేయర్ బరిలో కోలగట్ల శ్రావణి

Vizianagaram: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా వైసీపీ నుంచి మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి తొలిరోజే ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 16 Oct 2026 7:18 PM IST
Vizianagaram
X

Vizianagaram: విజయనగరం మేయర్ బరిలో కోలగట్ల శ్రావణి

విజయనగరం: విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణంలో సందడి నెలకొంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లోఎన్నికల నామినేషన్ పర్వం మొదలైంది. తొలి రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థినిగా మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి నామినేషన్ దాఖలు చేశారు.

ఆమెతో పాటు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరబద్రస్వామి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పి సురేష్ బాబు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

అనంతరం శ్రావణి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలే తమ విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లు డిప్యూటీ మేయర్ గా పనిచేసి విజయనగరం అభివృద్ధికి కృషి చేశామని గుర్తు చేశారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.