Gurla: చుక్కపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: వృద్ధురాలు మృతి

Gurla: విజయనగరం–చీపురుపల్లి రోడ్డులోని చుక్కపేట వద్ద ఆటోను బైక్ ఢీకొన్న ప్రమాదంలో సామేను సామలమ్మ (63) అనే మహిళ తీవ్ర గాయాలతో మృతి చెందింది.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 6 Oct 2026 5:07 PM IST
Gurla
X

Gurla: చుక్కపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: వృద్ధురాలు మృతి

గుర్ల, విజయనగరం జిల్లా: విజయనగరం - చీపురుపల్లి ప్రధాన రహదారిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ రోజు అనగా 06.10.2026 ఉదయం సుమారు 06:00 గంటల సమయంలో చుక్కపేట సమీపంలో విజయనగరం నుండి చీపురుపల్లి వైపు వెళ్తున్న ఆటోను, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం రాష్ అండ్ నెగ్లిజెంట్‌గా నడుపుతూ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సామేను సామలమ్మ (63), భర్త అప్పయ్య, పల్లివీధి, విజయనగరం అనే మహిళకు తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.

సమాచారం అందుకున్న వెంటనే గుర్ల ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం మరియు డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY