Gurla: పెనుబర్తి పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన డీఈవో

Gurla: విజయనగరం జిల్లా గుర్ల మండలం పెనుబర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం, ఎస్‌ఏ-1 గణితం పరీక్షను డీఈవో యు. మాణిక్యం నాయుడు పరిశీలించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 12 Nov 2026 2:57 PM IST
Gurla
X

Gurla: పెనుబర్తి పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన డీఈవో

గుర్ల: విజయనగరం జిల్లా గుర్ల మండలం పెనుబర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ యు. మాణిక్యం నాయుడు గారు బుధవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

పీఎం పోషణ్ పథకం కింద విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, మెనూ, పరిశుభ్రతను ఆయన స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పాఠశాలలో జరుగుతున్న SA-1 గణితం పరీక్షను పరిశీలించి, ఓపెన్ టెన్త్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ACGE సన్యాసిరాజు, MEO-1 భానుప్రకాష్, MEO-2 శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు ఉమామహేష్, కె. శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY