Vizianagaram: భారీ వర్షాల హెచ్చరిక అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్

Vizianagaram: విజయనగరం జిల్లాలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి టెలికాన్ఫరెన్స్. 24 గంటలు కంట్రోల్ రూమ్‌లు పనిచేయాలని ఆదేశం.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 23 Sept 2026 8:01 PM IST
Vizianagaram
X

Vizianagaram: భారీ వర్షాల హెచ్చరిక అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్

విజయనగరం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధవారం రాత్రికి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు.

బుధవారం రాత్రి జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లలో 24 గంటల పాటు సిబ్బంది విధులు నిర్వర్తించాలని, ఫిర్యాదులను తీసుకొని తక్షణ చర్యలకు సంబంధిత అధికారులకు పంపాలని ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాలు, ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మానవ, పశు ప్రాణనష్టం జరగకుండా అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి ప్రవాహలకు ఉన్న అడ్డంకులు తొలగించి నీరు సజావుగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిదంగా విధ్యుత్ సమస్యలు, చెట్లు పడిపోవటం లాంటివి సంభవిస్తే వెంటనే పరిస్థితులు చక్కదిద్దాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందేలా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.