Cheepurupalli: రామలింగాపురంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవ ఎంపిక!

Cheepurupalli: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పిన్నింటి శ్రీనివాసరావును నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 19 Nov 2026 12:43 PM IST
Cheepurupalli
X

Cheepurupalli: రామలింగాపురంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవ ఎంపిక!

విజయనగరం జిల్లా, చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఎంపిక ఏకగ్రీవంగా జరిగింది. రామలింగాపురం గ్రామంలో ఈరోజు నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పిన్నింటి శ్రీనివాసరావును పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ్రామ మహిళలు పిన్నింటి శ్రీనివాసరావుకు నుదుటన బొట్టు పెట్టి, అక్షింతలు వేసి దీవించారు. నాయకులు చప్పట్లు కొడుతూ ఆయనకు అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కాదని, కేవలం తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY