Vizianagaram: వరద నీటిలో బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయం!
Vizianagaram: బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయాన్ని ముంచెత్తిన భారీ వర్షం: ఇంజనీరింగ్, వ్యవసాయ కార్యాలయాల్లోకి మోకాళ్ల లోతు నీరు. ఫైళ్లు, కంప్యూటర్లు తడిసిముద్ద.. సిబ్బంది అవస్థలు.
Vizianagaram: వరద నీటిలో బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయం!
Vizianagaram: పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వరద నీటిలో చిక్కుకుంది. ఎడతెరిపి లేని వర్షాలకు కార్యాలయం ఆవరణం మొత్తం నీట మునిగింది.ఎంపీడీవో కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగం, వెలుగు ఆఫీసు, మండల వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. ఆఫీసుల్లోకి నీరు చేరడంతో కంప్యూటర్లు, ఫైళ్లు, ఫర్నిచర్ అన్నీ నీట మునిగాయి.
ఉద్యోగులు కుర్చీలపై కాళ్లతో కూర్చొని విధులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతి ఏటా ఇదే పరిస్థితి పునరావృతం అవుతున్నా, సంబంధిత శాఖ అధికారులు శాశ్వత నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని రైతులు, రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.




