Veeraghattam: వీరఘట్టంలో వైఎస్సార్‌సీపీ సమీక్ష: స్థానిక పోరుకు విక్రాంత్ పిలుపు

Veeraghattam: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని వీరఘట్టం వైఎస్సార్‌సీపీ సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి స్పష్టం చేశారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 2 Oct 2026 8:40 PM IST
Veeraghattam
X

Veeraghattam: వీరఘట్టంలో వైఎస్సార్‌సీపీ సమీక్ష: స్థానిక పోరుకు విక్రాంత్ పిలుపు

Veeraghattam: వీరఘట్టం మండల కేంద్రంలో శ్రీకోదండ రామ కళ్యాణ మండపం ఆవరణలో వైయస్సార్సీపి మండల స్థాయి సమావేశం మండల కన్వీనర్ శ్రీ దమలపాటి వెంకటరమణ నాయుడు అధ్యక్షతన జరిగినది.

ముఖ్య అతిథులుగా నియోజకవర్గ పరిశీలకులు మరియు శాసనమండలి సభ్యులు శ్రీ పాలవలస విక్రాంత్ మరియు మాజీ శాసనసభ్యులు శ్రీమతి విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మండలములో గల గ్రామాలకు గతంలో వేసిన కమిటీలకు ఐడెంటి కార్డులను పంపిణీ చేశారు వారికి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతీ కార్యకర్తకు భరోసా కల్పించాలని ఉద్దేశంతో ఐదు లక్షలు బీమా సదుపాయం కల్పించారని శ్రీ కళావతి అన్నారు.

మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన నియోజకవర్గంలో రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి స్థానాన్ని పోటీ చేసే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీ విక్రాంత్ మాట్లాడుతూ

స్థానిక సంస్థ ఎన్నికల్లో మునిసిపల్, జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులకు పోటీ చేయడానికి ఆసక్తిగల అభ్యర్థులు అందరూ సంబంధిత అధికారులచే కుల ధ్రువీకరణ పత్రము, ఇంటి పన్ను, మరియు ప్రభుత్వమునకు సంబంధించి ఇతరతర పన్నులను బాకీ లేకుండా చెల్లించి నిరభ్యంతర పత్రమును ముందుగా తీసుకొనవలెను.

స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే స్థానం నుండి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ తో పాటు అతనికి డమ్మీగా మరొక నామినేషన్ వేసుకునే విధంగా స్థానిక నాయకత్వం తగిన ఏర్పాట్లు చేసుకోవలసిన బాధ్యత ఉందని చెప్పారు.

గత ఐదు సంవత్సరములు ప్రభుత్వం నడిపిన శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు మేయర్ స్థానాల్లో 69%, మున్సిపల్ చైర్మన్ లకు 53%, జడ్పిటిసి స్థానాలకు 46%, మండల స్థాయిలో 68% మేర అధిక ప్రాధాన్యత ఇచ్చి, బీసీలకు సముచిత స్థానము కల్పించి, ఏకకాలంలో పదవులకు పెద్ద పేట వేసి చూపించిన ఘనత మన ప్రియతమ నేతకే దక్కినది అని సగౌరవంగా చెప్పారు.

కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం జీవోలు పేరుతో బీసీలను మోసం చేయడం సరికాదు. 34 శాతం రిజర్వేషన్ అమలు పై ప్రభుత్వం న్యాయపరమైన స్పష్టత ఇవ్వాలి నిజంగా బీసీలకు మేలు చేయాలంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో అమలు చేసి చూపించాలి అని అన్నారు.

ఈ సమావేశంలో కర్రీ లీలా ప్రసాదరావు, కర్రీ గోవిందరావు, పొట్నూరు లక్ష్మణరావు మరియు వైయస్సార్సీపి పట్టణ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు, డైరెక్టర్లు రాష్ట్ర జిల్లాస్థాయి కమిటీ సభ్యులు, మండల గ్రామ అనుబంధ విభాగ కమిటీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA