Veeraghattam: వీరఘట్టంలో ఎమ్మెల్యే జయకృష్ణకు వీవోఏల వినతిపత్రం

Veeraghattam: గౌరవ వేతనం పెంపు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వీరఘట్టంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు 175 మంది వీవోఏలు వినతిపత్రం అందజేశారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 7 Oct 2026 7:03 PM IST
Veeraghattam
X

Veeraghattam: వీరఘట్టంలో ఎమ్మెల్యే జయకృష్ణకు వీవోఏల వినతిపత్రం

వీరఘట్టం: పాలకొండ నియోజకవర్గంలో వెలుగు/SERP పరిధిలో పనిచేస్తున్న సుమారు 175 మంది VOAలు వీరఘట్టం క్యాంపు కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ గారిని కలిసి తమ సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా VOAలు తమ ప్రధాన డిమాండ్లను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. గౌరవ వేతనాన్ని రూ.8,000/- నుండి రూ.26,000/-కు పెంచాలి.

గౌరవ వేతనాన్ని VOAల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలి. VOAలకు బీమా సామాజిక భద్రతా సౌకర్యం కల్పించాలి.

VOAల సమస్యలను గౌరవ ఎమ్మెల్యే గారు సానుకూలంగా పరిశీలించి, వారి న్యాయమైన డిమాండ్లను గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA