Vizianagaram: చంపావతి నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం!

Vizianagaram: విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడు సమీపంలోని చంపావతి నదిలో సుమారు 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వివరాల కోసం పోలీసులను సంప్రదించాలి.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 27 Sept 2026 6:04 PM IST
Vizianagaram
X

Vizianagaram: చంపావతి నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం!

Vizianagaram: గుర్ల మండలం కోటగండ్రేడు గ్రామ సమీపంలోని చంపావతి నదీ ప్రవాహంలో ఉన్న పంప్‌హౌస్ వద్ద 27.09.2026 ఉదయం సుమారు 11.00 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం నీటిలో తేలియాడుతూ స్థానికులకు కనిపించింది.

మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు. నల్లటి జుట్టు కలిగి ఉండి, ఎరుపు రంగు బనియన్, బిస్కెట్ రంగు షర్టు, మోకాళ్ల వరకు ఉండే జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా తమ కుటుంబ సభ్యులు ఎవరైనా కనిపించకుండా పోయినట్లయితే, SI, గుర్ల – 9121109443 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY