Rajam: రాజాంలో జనసైనికుల ఆవేదన: కష్టపడిన వారికి గుర్తింపు లేదా?
Rajam: రాజాం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన చైర్మన్ పదవిని బయట వ్యక్తులకు కట్టబెట్టడంపై స్థానిక జనసైనికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Rajam: రాజాంలో జనసైనికుల ఆవేదన: కష్టపడిన వారికి గుర్తింపు లేదా?
రాజాం: రాజాం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీలో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఉదయం స్థానిక పాలకొండ రోడ్డు డొంకల మిల్లు జంక్షన్ వద్ద జనసైనికులు సమావేశమై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన జెండాలు మోస్తూ, కండువాలు ధరించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కష్టపడ్డామని జనసైనికులు పేర్కొన్నారు. పార్టీ కోసం వ్యక్తిగత ఉద్యోగాలు, ఇతర అవకాశాలను సైతం పక్కనపెట్టి ప్రజాసేవే లక్ష్యంగా పనిచేశామని తెలిపారు.
అయితే ప్రస్తుతం రాజాం మున్సిపాలిటీలో ఎన్నికల నేపథ్యంలో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించిన చైర్మన్ పదవిని, పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారిని పక్కనపెట్టి బయట నుంచి వచ్చిన వ్యక్తికి కేటాయించాలనే నిర్ణయం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
గతంలో కూడా రాజాం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనసేనకు కేటాయించినప్పటికీ, ఆ పదవిని టీడీపీకి చెందిన వ్యక్తులు దక్కించుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలోనూ జనసైనికులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ కోసం మొదటి నుంచి జెండా పట్టుకుని తిరిగిన వారిలో ఎవరికైనా అవకాశం కల్పిస్తే తమకు సమ్మతమేనని, కనీసం పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు కేవలం పదవుల కోసం జనసేన కండువా కప్పి అవకాశం కల్పించడం బాధాకరమని అన్నారు.
ముఖ్యంగా స్థానిక జనసైనికులతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా కీలక నిర్ణయాలు తీసుకుని వాటిని తమపై రుద్దడం పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తోందని తెలిపారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని జనసైనికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.




