Vizianagaram: ఎస్.కోటలో ఎంపీటీసీ నామినేషన్ల సందడి: ఎమ్మెల్యే లలితకుమారి

Vizianagaram: విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఎంపీటీసీ నామినేషన్ల దాఖలు జోరుగా సాగింది. టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ వెంట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి హాజరయ్యారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 22 Oct 2026 4:34 PM IST
Vizianagaram
X

Vizianagaram: ఎస్.కోటలో ఎంపీటీసీ నామినేషన్ల సందడి: ఎమ్మెల్యే లలితకుమారి

విజయనగరం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది.జడ్పిటిసి,ఎంపీటీసీ సభ్యత్వానికి సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతుండడంతో పార్టీలకు చెందిన లీడర్లు పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ల కేంద్రాలకు తరలి వెళుతుండటంతో రాజకీయ సందడి నెలకుంది.

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ,నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కోలాహలంగా ప్రారంభమైంది.అధికార కూటమి పార్టీ,ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి తమ అభిమానులు,పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద సంఖ్యలో మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు.

సంతగైరమ్మ పేటకు చెందిన టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా రాయవరపు చంద్రశేఖర్ నామినేషన్ కార్యక్రమానికి ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి,డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ తమ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ కేంద్రానికి చేరుకుని, రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.