Kurupam: కురుపాంలో ‘సేవా సంకల్ప అభియాన్’ ఉచిత వైద్య శిబిరం!

Kurupam: నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

V.SESHU	, KURUPAM
Published on: 12 Oct 2026 11:32 AM IST
Kurupam
X

Kurupam: కురుపాంలో ‘సేవా సంకల్ప అభియాన్’ ఉచిత వైద్య శిబిరం!

Kurupam: దేశ ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల నిస్వార్థ ప్రజాసేవను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో ప్రజలకు వైద్య సేవలు అందించారు.

ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రతి ఒక్కరికీ అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ వైద్య శిబిరం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తూ, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ సందీప్, సునీల్, వాసు, జగన్నాధం, ప్రణీత పాల్గొని వైద్య సేవల కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. వీరితో పాటు స్థానిక బీజేపీ సీనియర్ నాయకులు నడుకూరు ధూళికేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు బోటు అనిల్, మండల అధ్యక్షులు గెంబలి ప్రదీప్, యువ మోర్చా అధ్యక్షులు రమేష్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాసరావు, ఎంజీబీ స్కూల్ చైర్మన్ మాణిభూషణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీవివాసరావు, సీనియర్ నాయకులు గౌడు బాలంకి తదితరులు పాల్గొన్నారు.

సేవా సంకల్ప అభియాన్ ద్వారా ప్రజలకు చేరువగా ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించడం, వైద్య సేవలపై అవగాహన కల్పించడం ద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు దోహదపడుతుందని కార్యక్రమంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ఇటువంటి శిబిరాలు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM