Parvathipuram: సీతానగరం మండలంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర విస్తృత ప్రచారం
Parvathipuram: పార్వతీపురం జిల్లా సీతానగరం మండలంలో వర్షాన్ని లెక్కచేయకుండా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రచారం. కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పిలుపు.
Parvathipuram: సీతానగరం మండలంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర విస్తృత ప్రచారం
పార్వతీపురం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి గడువు సమీపిస్తుండటంతో సీతానగరం మండలంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
గెడ్డలుప్పి ఎంపీటీసీ అభ్యర్థి కర్రి శంకరరావు, తామరఖండి గ్రామానికి చెందిన ఆదినారాయణ, బగ్గందొరవలస, కృష్ణరాయపురం ఎంపీటీసీ అభ్యర్థి చినబోగిలి చుక్క నాగమణి (జనసేన), అంటిపేట, పనుకువలస గ్రామాలకు చెందిన లత శ్రీ, మరిపివలస, సూరంపేట ఎంపీటీసీ అభ్యర్థి మర్రపు సత్యనారాయణ తరపున ఆయా గ్రామాల్లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలను నేరుగా కలుసుకుని అభ్యర్థులకు మద్దతు కోరారు.
ఈ సందర్భంగా టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కంకణపల్లి అనురాధతో పాటు కూటమి ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని, ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో విజయం చేకూర్చాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో మండలంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు మరింత కృషి చేస్తామని తెలిపారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సాగిన ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




