Seethampeta: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: నషా ముక్త్ యువ!

Seethampeta: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మై భారత్, నవ యువ సేవా సంఘం ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ యువ’ మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు జరిగింది.

KAILASH SAHU, PALAKONDA
Published on: 10 Nov 2026 9:40 PM IST
Seethampeta
X

Seethampeta: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: నషా ముక్త్ యువ!

సీతంపేట: సీతంపేట వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా యువతలో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించి, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా మై భారత్ పార్వతీపురం మరియు నవ యువ సేవా సంఘం ఆధ్వర్యంలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీతంపేట వారి సహకారంతో మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (GDC), సీతంపేటలో 'నషా ముక్త్ యువ' కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, మానసిక మరియు సామాజిక పరిణామాలు, వ్యక్తిగత జీవితంపై వాటి ప్రభావం గురించి వివరించారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల అలవాట్ల కారణంగా కుటుంబ సభ్యులు ఎదుర్కొనే ఆర్థిక, మానసిక ఇబ్బందులు, కుటుంబ సంబంధాలపై పడే ప్రభావం గురించి అవగాహన కల్పించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, సమాజంలో మాదకద్రవ్యాల వ్యతిరేక చైతన్యాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సుశాంత్ జెనా, వైస్ ప్రిన్సిపాల్ డా. ఎస్. రవికుమార్, ఎకనామిక్స్ అధ్యాపకులు డా. ఎం. శంకరరావు, పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు కుమారి భవాని పాల్గొన్నారు. నవ యువ సేవా సంఘం అధ్యక్షుడు శ్రీ బి. సురేంద్ర తన బృంద సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని, యువతకు మాదకద్రవ్యాల నిర్మూలన ఆవశ్యకతను వివరించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ వంతు సహకారం అందించాలని సంకల్పించారు. యువత చురుకైన భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA