Salur: సాలూరులో అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి

Salur: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్‌ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు.

B VENKATESH, SALURU
Published on: 28 Sept 2026 3:53 PM IST
Salur
X

Salur: సాలూరులో అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి

పార్వతిపురం మన్యం జిల్లా: సాలూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో అన్నక్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి.ఈరోజు మన సాలూరులో ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అదే "అన్న క్యాంటీన్" ప్రారంభోత్సవం: మంత్రి సంధ్యారాణి.

అన్న క్యాంటీన్ అనేది ఎన్టీఆర్ పేదవాడికి కూడు, గూడు, గుడ్డ, అనే ఆశయానికి నిదర్శనం. ఆ స్పూర్తినే చంద్రబాబు నాయుడు తీసుకెళ్తున్నారు.

మన పెద్దలు అనేవారు - "ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు" అని. ఆకలితో ఉన్నవాడికి కులం, మతం, పార్టీ ఉండదు. కావాల్సింది ఒక్కటే - కడుపు నిండా అన్నం.

ఈ రోజుల్లో హోటల్ కి వెళ్తే కనీసం 100, 120 రూపాయలు అయిపోతుంది. రోజు కూలి చేసుకునే కార్మికుడు, ఆటో తోలే అన్న, రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే అక్క... మీరు ప్రతిరోజూ అంత డబ్బు పెట్టి తినగలరా? ఆలోచించండి: మంత్రి సంధ్యారాణి

అన్న క్యాంటీన్ లో 5 రూపాయలకే వేడి వేడి అన్నం, పప్పు, కూర, సాంబార్, పెరుగు... కడుపు నిండా పెడుతుంది. ఇది కేవలం పథకం కాదు. పేదవాడి మీద ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు నిదర్శనం

ఇక్కడ నాణ్యతలో రాజీ లేదు. మన ఇంట్లో ఎలా వండుకుంటామో, అలాగే పరిశుభ్రంగా వండుతారు

ఎన్టీఆర్ అనేవారు - "సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు" అని ఆ మాటను నిజం చేస్తూ, ఏ పేదవాడు ఆకలితో నిద్రపోకూడదన్న సంకల్పంతో ఈ క్యాంటీన్ ను ప్రారంభిస్తున్నాం అన్న క్యాంటీన్ తలుపులు అందరికీ తెరిచే ఉంటాయి. ఆకలి తీర్చడం కంటే గొప్ప సేవ లేదు.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU