Parvathipuram: కోటియా వివాదాస్పద గ్రామాల్లో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
Parvathipuram: కోటియా సరిహద్దు గ్రామాల్లో పోలీసుల దాడులు. 2,800 లీటర్ల బెల్లం ఊట, నాటుసారా స్వాధీనం చేసుకొని సీజ్ చేసిన పార్వతీపురం మన్యం పోలీసులు.
Parvathipuram: కోటియా వివాదాస్పద గ్రామాల్లో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
పార్వతీపురం మన్యం జిల్లా: ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని కోటియా వివాదాస్పద గ్రామాల పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సాలూరు మండలంలోని దొర్లరాడివలస, ములతాడివలస, దూలిభద్ర గ్రామాల పరిసర కొండ ప్రాంతాల్లో నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు చేసి, 2,800 లీటర్ల బెల్లం ఊటతో పాటు 3 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.
కొండ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో 14 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన బెల్లం ఊటను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సామగ్రి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని అంచనా వేశారు. పోలీసులను గమనించిన నాటుసారా తయారీదారులు అక్కడి నుంచి పరారవగా, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తోనాం, దిగుమెండంగి, సంబుగం గ్రామాల్లోనూ పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.
జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవరెడ్డి ఆదేశాల మేరకు, డీఎస్పీ చి.వి. శేషయ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో సీఐ పి. రామకృష్ణ, ఎస్‌ఐలు బి. రవీంద్రరాజు, ఎం. వెంకటరమణతో పాటు సుమారు 30 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




