Parvathipuram: నర్సిపురం రైల్వే సమస్యలపై డీఆర్‌ఎంతో ఎమ్మెల్యే భేటీ!

Parvathipuram: పార్వతీపురం నియోజకవర్గ పరిధిలోని నర్సిపురం రైల్వే స్టేషన్ రిటైనింగ్ వాల్ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర విశాఖ డీఆర్‌ఎంకు వినతిపత్రం అందించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 10 Nov 2026 6:42 PM IST
Parvathipuram
X

Parvathipuram: నర్సిపురం రైల్వే సమస్యలపై డీఆర్‌ఎంతో ఎమ్మెల్యే భేటీ!

పార్వతీపురం: పార్వతీపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధితో పాటు రైల్వే మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రత్యేక చొరవ చూపుతున్నారు. నియోజకవర్గ పరిధిలో రైల్వే ప్రయాణికులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంబంధిత రైల్వే అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలోని రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయానికి వెళ్లి, డివిజనల్ రైల్వే మేనేజర్‌ను స్వయంగా కలిసి నర్సిపురం రైల్వే స్టేషన్ వద్ద నెలకొన్న సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు.

ఇటీవల సంభవించిన అర్నబ్ తుపాను ప్రభావంతో నర్సిపురం రైల్వే స్టేషన్ వద్ద కొత్తగా నిర్మించిన ప్లాట్‌ఫాం సమీపంలోని రిటైనింగ్ వాల్ కూలిపోయిందని ఎమ్మెల్యే వివరించారు. ఈ గోడ కూలిపోవడం వల్ల ప్లాట్‌ఫాం కింద నుంచి ప్రవహించే మురుగునీటి కాలువ వ్యవస్థకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని, దీనివల్ల సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)