Parvathipuram: జడ్పీ చైర్మన్ పదవి దక్కలేదని కురుపాం టీడీపీ శ్రేణుల నిరసన!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవి జనసేనకు కేటాయించడంపై కురుపాం టీడీపీ శ్రేణులు నిరసన తెలిపి జడ్పీటీసీ వీరేష్ చంద్రదేవ్‌ను అడ్డుకుని గేట్లకు తాళాలు వేశాయి.

V.SESHU	, KURUPAM
Published on: 20 Nov 2026 1:37 PM IST
Parvathipuram
X

Parvathipuram: జడ్పీ చైర్మన్ పదవి దక్కలేదని కురుపాం టీడీపీ శ్రేణుల నిరసన!

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవిని కురుపాం జడ్పీటీసీ వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్‌కు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారని, అయితే కూటమి పార్టీల సీట్ల సర్దుబాటులో భాగంగా జడ్పీ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించడంపై కురుపాం టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్లిన వీరేష్ చంద్రదేవ్‌ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎన్నికలకు వెళ్లవద్దంటూ నిరసన వ్యక్తం చేస్తూ గేట్లకు తాళాలు వేశారు.

జడ్పీ చైర్మన్ పదవిపై గతంలో ఇచ్చిన హామీని అమలు చేయకుండా జనసేనకు కేటాయించడంపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామంతో కురుపాం ప్రాంతంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ అక్కడికి చేరుకొని పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయాలను, కూటమి ధర్మాన్ని గౌరవించాలని సూచించారు. అనంతరం వీరేష్ చంద్రదేవ్‌ను తన కారులో ఎక్కించుకుని, స్వయంగా కారు నడుపుతూ పార్వతీపురం తీసుకెళ్లారు. దీంతో జడ్పీ చైర్మన్ పదవి కేటాయింపు అంశం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM