Parvathipuram: ఎలక్షన్ కోడ్ అమలు: సోమవారం గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు!
Parvathipuram: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో పీజీఆర్ఎస్, డైలీ గ్రీవెన్స్ కార్యక్రమాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
Parvathipuram: ఎలక్షన్ కోడ్ అమలు: సోమవారం గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు!
పార్వతీపురం: జిల్లాలో స్థానిక సంస్థల (మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ సర్పంచ్) ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్ కోడ్) అమలులోకి వచ్చినందున, కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పిజిఆర్ఎస్ మరియు డైలీ గ్రివెన్స్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి తెలిపారు.
ఈ ఎన్నికల కోడ్ అక్టోబర్ 14 నుండి డిసెంబర్ 03 వరకు అమలులో ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ గడువు ముగిసే వరకు ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గమనించాలని కోరారు.




