Palakonda: పాలకొండ ఎంపీడీఓ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తనిఖీ!
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ తనిఖీ చేశారు.
Palakonda: పాలకొండ ఎంపీడీఓ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తనిఖీ!
పాలకొండ: పాలకొండ ఎంపీడీఓ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ పాలకొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఎన్నికల సామగ్రి పంపిణీకి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేలా సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పంపిణీ కేంద్రం వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో నిర్వహించి, పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.




