Palakonda: పాలకొండలో ఎన్‌ఎస్‌ఎన్ రైస్ మిల్లును తనిఖీ చేసిన సబ్ కలెక్టర్!

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పరిధిలోని ఎన్‌ఎస్‌ఎన్ (NSN) రైస్ మిల్లును సబ్ కలెక్టర్, తహశీల్దార్‌తో కలిసి తనిఖీ చేసి నిల్వలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 24 Nov 2026 1:54 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో ఎన్‌ఎస్‌ఎన్ రైస్ మిల్లును తనిఖీ చేసిన సబ్ కలెక్టర్!

పాలకొండ: పాలకొండ పరిధిలోని NSN రైస్ మిల్లును పాలకొండ సబ్ కలెక్టర్ గారు, పాలకొండ తహశీల్దార్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మిల్లులో ఉన్న బియ్యం నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బియ్యం నిల్వలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసి, అప్‌డేట్ చేయాలని మిల్లు యాజమాన్యానికి ఆదేశించారు.

అలాగే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమర్పించాల్సిన బ్యాంక్ గ్యారంటీని ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన సమర్పించాలని మిల్లు యాజమాన్యాన్ని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, నిల్వల వివరాల్లో పారదర్శకత పాటించాలని ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గారు సూచించారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA