Parvathipuram: పాలకొండలో ఘనంగా సుస్థిర జీవనశైలి వారోత్సవాలు!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సుస్థిర జీవనశైలి వారోత్సవాలు నిర్వహించారు. చిన్నారులు, తల్లులతో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు.
Parvathipuram: పాలకొండలో ఘనంగా సుస్థిర జీవనశైలి వారోత్సవాలు!
పార్వతీపురం: ఐసీడీఎస్ (ICDS) పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఐసీడీఎస్ (ICDS) అధికారులు సుస్థిర జీవనశైలి వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పాఠశాల విద్యార్థులతో సుస్థిర జీవనశైలిని అలవాటు చేసుకుందాం అంటూ ప్రతిజ్ఞ చేయించారు. చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచించారు.
నీటిని, విద్యుత్‌ను వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటిస్తూ సుస్థిర ఆహార విధానాన్ని అలవరుచుకోవాలని తెలిపారు. అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నియంత్రించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
సుస్థిరమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ప్రి - స్కూలు పిల్లలకు మరియు ఫ్రైమరీ స్కూలు పిల్లలకు చెప్పడం జరిగింది. అంగన్వాడి కార్యకర్తలక మరియు తల్లులకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి.డి.పి.జో మేడం . శ్రీమతి పి. రంగలక్ష్మి గారు. సూపర్వైజర్లు. పి. దశరత్నం S. విస్సమ్మ . N. లావణ్య మరియు N. రాజేశ్వరి, J - ఙ్ఞానమ్మ పాల్గొన్నారు.




