Palakonda: డిసెంబర్ 1 నుండి 3 వరకు జరగనున్న ఢిల్లీ ధర్నాను జయప్రదం చేయండి!
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ శ్రీరామ డిగ్రీ కాలేజీ ఆవరణలో డిసెంబర్ 1 నుండి 3 వరకు జరగనున్న ఢిల్లీ ముట్టడి పోస్టర్‌ను సిఐటియు, ఆశా వర్కర్స్ నాయకులు ఆవిష్కరించారు.
Palakonda: డిసెంబర్ 1 నుండి 3 వరకు జరగనున్న ఢిల్లీ ధర్నాను జయప్రదం చేయండి!
పాలకొండ: ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ పాలకొండ అర్బన్ సిఐటియు ఆధ్వర్యంలో సదస్సు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ధావాల రమణారావు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు. కే గౌరీశ్వరి అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి అమరవేణి సిఐటియు మండల కార్యదర్శి కాద రాము మాట్లాడుతూ.
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తూ, కార్మికులకు నష్టదాయకంగా తెచ్చిన నాలుగు లేబర్‌కోడ్స్‌ను రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.42 వేలు,పెన్షన్ రూ.21 వేలుగా నిర్ణయించాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్రచట్టం, సామాజిక భద్రత,ఖాళీల భర్తీ,సర్ రద్దు, జల్`జమీన్`జంగిల్‌పై ప్రజల హక్కులు కాపాడాలని లక్షలాది మంది కార్మికులతో డిసెంబర్ 1 నుంచి ఢిల్లీ ముట్టడి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాదిగా కార్మికులు పాల్గొనాలని పిలుపునిస్తూ.
కార్పొరేట్ కంపెనీలు కొత్తగా తీసుకునే ఉద్యోగుల వేతనాల్లో కొంత భాగం, యజమాని కట్టాల్సిన పీఎఫ్ వాటాను కూడా కేంద్ర ప్రభుత్వమే కట్టడానికి కేటాయింపులు చేసింది. వారికి లక్షలాది కోట్లు పన్నులు రాయితీలిస్తున్నది. రుణ మాఫీలు చేస్తున్నది. మరో ప్రక్క వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల (స్కీం) వర్కర్లను కార్మికులుగా గుర్తించి వారికి కనీస వేతనాలు ఇవ్వటానికి, సామాజిక భద్రత కల్పించటానికి డబ్బులు లేవంటున్నది.కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్,స్కీమ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయటానికి బడ్జెట్ లేదంటున్నది.
మోడీ ప్రభుత్వం 4 లేబర్కోడ్లను అమల్లోకి తెచ్చి కనీస వేతనాన్ని మరింతగా దిగజార్చింది. జాతీయ కనీస వేతనం పేరిట రోజుకు రూ.178/` లు వేతనంగా నిర్ణయించింది.8 గంటల పని విధానానికి తూట్లు పొడిచింది.ఉద్యోగ భద్రతను కాలరాసింది. సమ్మె చేయకుండా ఆటంకాలు విధించింది. కోట్లాది మంది కార్మికులను కార్మిక చట్టాలు అమలు కాకుండా చేసింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి తోకగా మారింది.పై డిమాండ్ల సాధనకై డిసెంబర్ 1 నుండి ఆక్యూపై ఢిల్లీ కార్యక్రమానికి సిఐటియు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో కార్మికులు మన రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున జయప్రదం చేయమని సిఐటియు ఏపి కమిటి పిలుపునిస్తున్నది.
రాష్ట్రంలో 4 లక్షల మంది అంగన్వాడీ,ఆశా, మధ్యాహ్నభోజనం, విఓఏ, ఆర్పీ, సమగ్రశిక్ష, నేషనల్ హెల్త్ మిషన్, ఉపాధిహామీ, 108,104, తల్లీ, బిడ్డా, అర్బన్ హెల్త్, ఆయÖష్, ఎన్టిఆర్ వైద్యసేవ తదితర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నారు. వీరే కాక 3 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, టైమ్‌స్కేల్, కంటింజెంట్, డైలీవేజ్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుత నిత్యవసర సరుకుల ధరలు,పెరిగిన ఇంటి అద్దెలు, గ్యాసు, విద్యుత్ చార్జీల నేపథ్యంలో అందరికీ కనీస వేతనం రూ.42 వేలుగా నిర్ణయించి అమలు చేయించాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది.
అందుకై డిసెంబర్ 1 ఢిల్లీ అక్రమణ కార్యక్రమంలో పాల్గొనమని సిఐటియు పిలుపునిస్తున్నది. ఇదే స్థాయిలో హమాలీ,ఆటో, గ్యాస్ కార్మికులు, బిల్డింగ్,స్వయం ఉపాధి, వలస కార్మికులకు కూడా నెల ఆదాయం రూ. 42 వేలు గ్యారంటీ చేయాలి. దీనిలో సగం పెన్షన్ రూపంలో, ఈపీఎస్t, సిపిఎస్, ఎన్‌పిఎస్ మరియు సామాజిక పెన్షనర్లకు ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్ నారాయణరావు ఆశ వర్కర్స్ యూనియన్ పి శ్రీదేవి, జి లక్ష్మి ,గౌతమి, కాంతామని ,ధనలక్ష్మి రాధా రాణి తదితరులు పాల్గొన్నారు.




