Parvathipuram: తాడికొండలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే జగదీశ్వరి!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

V.SESHU	, KURUPAM
Published on: 26 Nov 2026 12:05 PM IST
Parvathipuram
X

Parvathipuram: తాడికొండలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే జగదీశ్వరి!

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల పోలింగ్‌లో ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాడికొండ గ్రామంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఉదయం చేరుకున్న ఆమె సాధారణ ఓటరుగా తన ఓటును వేశారు.

ఈ సందర్భంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యతను ఎమ్మెల్యే వివరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు ఎంతో కీలకమని, ఎన్నికల ద్వారా ప్రజలు తమ గ్రామ అభివృద్ధికి అవసరమైన నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.

ఎన్నికల ప్రక్రియలో ప్రజలందరూ చురుగ్గా భాగస్వాములై ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు మాత్రమే కాకుండా సామాజిక బాధ్యత కూడా అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటు వేయాలని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఈ సందర్భంగా కోరారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM