Parvathipuram: సోమేశ్వర స్వామి ఆలయం చుట్టూ నాగావళి వరద!

Parvathipuram: కొమరాడ మండలం దేవునిగుంపు సోమేశ్వర స్వామి ఆలయాన్ని చుట్టుముట్టిన నాగావళి వరద నీరు భక్తులు రావద్దని దేవాదాయ శాఖ హెచ్చరిక, ముందస్తుగా పూజా సామగ్రి భద్రం.

V.SESHU	, KURUPAM
Published on: 24 Sept 2026 7:15 PM IST
Parvathipuram
X

Parvathipuram: సోమేశ్వర స్వామి ఆలయం చుట్టూ నాగావళి వరద!

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం: కొమరాడ మండలంలోని దేవునిగుంపు గ్రామంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం వద్ద నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రభావంతో ఆలయం చుట్టుపక్కల ప్రాంతం పూర్తిగా నీటమునిగింది.

దేవాలయానికి సుమారు కిలోమీటరు దూరం నుంచే వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో భక్తులు ఆలయ ప్రాంతానికి వెళ్లకుండా దేవాదాయ శాఖ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆలయానికి వెళ్లేందుకు ఎలాంటి అవకాశం లేదని అధికారులు తెలిపారు.

అలాగే స్వామివారికి సంబంధించిన విలువైన వస్తువులు, పూజా సామగ్రిని అర్చకులు ముందస్తు జాగ్రత్తగా భద్రపరిచినట్లు వెల్లడించారు. వరద నీటి ప్రవాహం తగ్గిన అనంతరం ఆలయ పరిసరాల్లో పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు చేపడతామని జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఎస్. రాజారావు తెలిపారు. ప్రజలు, భక్తులు తమ భద్రత దృష్ట్యా ఆలయ ప్రాంతానికి వెళ్లకుండా అధికారుల సూచనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM