Parvathipuram: కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే విజయచంద్ర!
Parvathipuram: పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల్లో 10, 19వ వార్డుల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన నేరేడువెల్లి శ్రీకాంత్, పోతల దుర్గాప్రసాద్ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమక్షంలో టీడీపీలో చేరారు.
Parvathipuram: కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే విజయచంద్ర!
పార్వతీపురం: పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల్లో 10, 19వ వార్డుల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన నేరేడువెల్లి శ్రీకాంత్, పోతల దుర్గాప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్వతీపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వారిద్దరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీపై విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో చేరిన వారిద్దరికీ సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వార్డుల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు. వారితో పాటు ఆయా వార్డులకు చెందిన పలువురు కుటుంబాలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




