Parvathipuram: నేడు అధికారిక లాంఛనాలతో మాజీ మంత్రి శత్రుచర్ల అంత్యక్రియలు
Parvathipuram: ఉత్తరాంధ్ర సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం పార్వతీపురం మన్యం జిల్లా చినమేరంగిలో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.
Parvathipuram: నేడు అధికారిక లాంఛనాలతో మాజీ మంత్రి శత్రుచర్ల అంత్యక్రియలు
పార్వతీపురం మన్యం జిల్లా: ఉత్తరాంధ్ర టైగర్, మన్యం పులిగా గుర్తింపు పొందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం ఆయన స్వగ్రామమైన జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.
విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్తతో పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు, అనుచరులు, ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
1978లో నాగూరు నుంచి ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన విజయరామరాజు మూడుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. 2017 నుంచి 2023 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. దశాబ్దాల పాటు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు చినమేరంగికి చేరుకుంటున్నారు.




