Parvathipuram: కొఠియాలో గిరిజనులపై మానవ హక్కుల ఉల్లంఘన: రాజన్నదొర!
Parvathipuram: కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసులు గిరిజనులను అరెస్టు చేయడం తీవ్ర ఆందోళనకరమని, బాధితులకు ఏపీ ప్రభుత్వం తక్షణమే న్యాయ, ఆర్థిక సహాయం అందించాలని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు.
Parvathipuram: కొఠియాలో గిరిజనులపై మానవ హక్కుల ఉల్లంఘన: రాజన్నదొర!
పార్వతీపురం: కొఠియా గ్రామాల్లో ఆంధ్రా–ఒడిశా వివాదం రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో గిరిజనులపై జరుగుతున్న పరిణామాలపై మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర తీవ్రంగా స్పందించారు.
ఒడిశా రాష్ట్ర పోలీసులు కొఠియా ప్రాంతానికి చెందిన గిరిజనులను అరెస్టు చేయడం తీవ్ర ఆందోళనకరమని,ఈ పరిణామాలు గిరిజనుల ప్రాథమిక హక్కులు,మానవ హక్కుల పరిరక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని పేర్కొన్నారు.సరిహద్దు వివాదాల పేరుతో అమాయక గిరిజనులు ఇబ్బందులు,అరెస్టులు ఎదుర్కోవాల్సి రావడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
గిరిజనుల మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉంది.గిరిజన సంక్షేమ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం,జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి అరెస్టయిన గిరిజనులకు అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు న్యాయ సహాయం అందించాలని రాజన్నదొర డిమాండ్ చేశారు.




