Palakonda: పాలకొండ కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
Palakonda: పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ ఐఏఎస్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు.
Palakonda: పాలకొండ కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
పాలకొండ: పాలకొండ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంగా ఏర్పాటు చేసిన పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సబ్ కలెక్టర్ శ్రీ స్వప్నిల్ పవార్, ఐఏఎస్ గారు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లు, కౌంటింగ్ హాళ్లలో మౌలిక సదుపాయాలు, సిబ్బందికి అవసరమైన వసతులు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అనంతరం కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి పలు సూచనలు జారీ చేస్తూ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉంటూ, తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు.




