Palakonda: పాలకొండ కోటదుర్గ నవరాత్రులు: ట్రాఫిక్ ఆంక్షలు విధింపు

Palakonda: పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 11 నుంచి 20 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల దారి మళ్లింపులను పోలీసులు ప్రకటించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 10 Oct 2026 11:37 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండ కోటదుర్గ నవరాత్రులు: ట్రాఫిక్ ఆంక్షలు విధింపు

Palakonda: పాలకొండ ప్రజలందరికీ పోలీస్ వారి విజ్ఞపి తేదీ 11 10 2026 నుంచి 20 10 2026 వరకు, పాలకొండ పట్టణం లో శ్రీ కోట దుర్గ అమ్మవారి నవరాత్రుల ఉత్సవాలు జరుగుతాయి కావున, భక్తులు ప్రజలు అందరూ కూడా పోలీసువారి ట్రాఫిక్ ఆంక్షలకి సహకరించవలసిందిగా కోరడమైనది.

రాజాం, విజయనగరం విశాఖపట్నం పార్వతిపురం వీర ఘట్టం నుంచి వచ్చే ప్రజా రవాణా వాహనాలన్నీ కూడా నేరుగా కోటదుర్గ అమ్మవారి గుడి ముందు నుంచి పాలకొండ టౌన్ లోకి అనుమతించబడవు.

అన్నవరం జంక్షన్ వద్ద వాటిని మళ్లించి అన్నవరం ఊరి లోపల నుంచి పాలకొండ వడమ వరకు మళ్లించడం అయింది. అదేవిధంగా శ్రీకాకుళం ,బూర్జ ఆముదాలవలస వైపు నుంచి వచ్చే ఇతర పెద్ద భారీ వాహనాలు ఏవి కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించేవి ఏవీ పాలకొండ పట్నంలోకి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి 11 వరకు పార్వతిపురం వైపుగాని వీరఘట్టం వైపు గాని రాయగడ వైపు గాని

అనుమతించబడవు. వాటిని గాయత్రి గుడి వద్ద ఉన్న అయ్యప్ప శంకర్ లేఔట్ వద్ద పార్కింగ్లో ఉంచుతాము లేదా వాళ్ళు రాయగడ వైపు గాని పార్వతిపురం వైపు గానీ వెళ్లాలనుకుంటే సీతంపేట బత్తిలి మీదుగా వెళ్ళవచ్చు.

ఆటోలు కానీ కార్లు కానీ ఏవి కూడా శ్రీ కోట దుర్గమ్మ వారి గుడి వైపు ఉదయం 5 నుంచి రాత్రి 11 వరకు అనుమతించబడవు. వీరఘట్టం జంక్షన్ వద్ద మరియు ఓల్డ్ ఆర్ అండ్ బి బిల్డింగ్ వద్ద మరియు హ్యాపీ షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ న ఆర్సీఎం చర్చి వద్ద భక్తుల వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించబడినవి. భక్తులు మరియు ప్రజలు ఎవరు కూడా మీ యొక్క వాహనాలను రోడ్డు మీద నిలిపివేసి దర్శనానికి వెళ్లవద్దని పోలీసువారి మనవి.

అదేవిధంగా దర్శనానికి వచ్చే భక్తులు మీ పిల్లలను మీ ఆభరణాలను విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరుచుకోవలెను. అదేవిధంగా తోటి భక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు కూడా నడుచుకోకూడదు. ఎక్కడైనా ఏవైనా ఘటనలు జరిగినట్లయితే వెంటనే పోలీసు వారికి తెలియపరచగలరు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA