Parvathipuram: పాలకొండలో నిజాయితీని చాటుకున్న మున్సిపల్ ఉద్యోగి!
Parvathipuram: మన్యం జిల్లా పాలకొండలో మున్సిపల్ ఉద్యోగి సత్యనారాయణ తనకు దొరికిన రూ.25 వేల నగదు, పత్రాలున్న పర్సును బాధ్యుడికి అందజేసి నిజాయితీ చాటుకున్నారు.
Parvathipuram: పాలకొండలో నిజాయితీని చాటుకున్న మున్సిపల్ ఉద్యోగి!
Parvathipuram: పాలకొండ నగర పంచాయతీ లో MLO గా పనిచేస్తున్న సత్యన్నారాయణ గారికి ఆఫీస్ నుండి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మార్గమధ్యలో రోడ్డు పై ఒక మనీ పర్స దొరికింది. ఆ పర్సలో విలువైన దృవపత్రాలు మరియు సుమారు 25 వేల రూపాయలు నగదు కలదు.ఆయన పర్సలో ఉన్న కొన్ని ఆధారాలతో సత్యం ఆయనకు కాల్ చేసి మీ మనీ పర్స్ నాకు దొరికింది. మీరు పాలకొండ మునిసిపల్ ఆఫీస్ కి వచ్చి తీసుకోవాలని చెప్పగా ఆయన ఈరోజు ఆఫీస్ కు వచ్చి గౌరవ కమీషనర్ వారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది.




