Palakonda: నేటి సాయంత్రంతో మున్సిపల్ ప్రచారానికి తెర: కలెక్టర్

Palakonda: నవంబర్ 1న జరగనున్న పాలకొండ మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుందని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 29 Oct 2026 10:13 PM IST
Palakonda
X

Palakonda: నేటి సాయంత్రంతో మున్సిపల్ ప్రచారానికి తెర: కలెక్టర్

పాలకొండ: ​పాలకొండ నవంబరు 1వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రం 5:00 గంటలతో ముగియనుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

​48 గంటల ముందే ప్రచార నిషేధం

​ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ప్రారంభానికి 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 5:00 గంటల తర్వాత జిల్లా వ్యాప్తంగా ఎలాంటి మైకులు, బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు మరియు ఇతర ప్రచార కార్యక్రమాలకు అనుమతి ఉండదని తేల్చిచెప్పారు.

​నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

​ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ​ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA