Parvathipuram: పార్వతీపురంలో బ్యాలెట్ బాక్సుల కండిషన్‌ను తనిఖీ చేసిన అధికారులు!

Parvathipuram: పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో బ్యాలెట్ బాక్సుల తనిఖీ. స్థానిక ఎన్నికల పారదర్శక నిర్వహణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 19 Oct 2026 3:26 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురంలో బ్యాలెట్ బాక్సుల కండిషన్‌ను తనిఖీ చేసిన అధికారులు!

పార్వతీపురం: జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన బ్యాలెట్ బాక్సుల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాబోయే స్థానిక ఎన్నికలను నిష్పాక్షికంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల కండిషన్, తాళాలు, సీలింగ్ సౌకర్యం తదితర సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశామని, ఏవైనా మరమ్మతులు ఉంటే తక్షణమే పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతీ బ్యాలెట్ బాక్స్ రికార్డును పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఎన్నికల విభాగానికి చెందిన సిబ్బంది పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)