Vizianagaram: ఎస్.కోటలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
Vizianagaram: విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 29 మంది లబ్ధిదారులకు రూ.16.49 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అందజేశారు.
Vizianagaram: ఎస్.కోటలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
Vizianagaram: చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, టీడీపీ సీనియర్ నేత కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ తీవ్ర అనారోగ్యం, అత్యవసర వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని శృంగవరపుకోట నియోజకవర్గ శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు. ఎల్.కోటలోని ఎమ్మెల్యే క్యాంప్కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె టీడీపీ సీనియర్ నాయకులు కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్‌తో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని మొత్తం 29 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.16.49 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశారు. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయాన్ని సరైన వైద్య అవసరాల కోసం సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.
అలాగే, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చొప్పా ఎర్నికా దేవి కుమార్తె అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.5.01 లక్షల విలువైన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే లలితకుమారి, రాంప్రసాద్ అందజేశారు. చికిత్స సకాలంలో అంది చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.




